కడప, ఆగస్టు 21 (న్యూస్‌టైమ్): వేంపల్లెలో మానవతా శాంతి ర్యాలీలో మానవత్వం లోపించింది. బుధవారం ఉదయం నుంచి వర్షం జోరుగా కురుస్తున్న విద్యార్థులతో ఓ స్కూల్ కరస్పాండెంట్ శాంతి ర్యాలీ నిర్వహించారు. వర్షం పడుతుండడంతో విద్యార్థులు తడిసి చలికివణికిపోయారు.

విద్యార్థులతో వర్షంలో ర్యాలీ చేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవతా సభ్యులు మాత్రం అందరూ గొడుగులు పట్టుకుని ఉన్నారు. విద్యార్థులను వర్షంలో తడిపించడం ఏంటని వేంపల్లెలో ర్యాలీ చూసిన ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు.