పాకిస్తాన్ కశ్మీర్‌ను కోరుకుంటుంది అక్కడ వారి మతస్తులు ఉన్నందుకో లేక కశ్మీర్ ప్రజలు వారిని కోరుకున్నందుకో కాదు. దాని వెనక పెద్ద రహస్యమే ఉంది. చైనా, సీపీఈసీ (చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్) అసలు పాకిస్తాన్, బలూచిస్తాన్‌లతో భారత్ ఎందుకు యుద్ధం చెయ్యట్లేదు? ప్రపంచ అగ్ర దేశాలు కూడా దీని మీద ఎందుకు ఎక్కువ ఒత్తిడి తేవట్లేదు? అందరికి పాకిస్తాన్ అనే దేశం తప్పు చేస్తుందని తెలిసినా, పాకిస్తాన్ సరిదిద్దుకునే చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం దోరకాలంటే? పక్కనే ఉన్న మరో దేశం చైనా గురించి ఆలోచించాలి.

పాకిస్తాన్ 1990 వరకు కాశ్మీర్ గురించి అంతగా పోరాడలేదు. ఎపుడైతే చైనా వాళ్ళు సీపీఈసీ (చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్) అనేది ప్రవేశపెట్టారో అప్పటి నుండే అసలైన టెర్రరిజం మొదలైంది. అసలు ఈ సీపీఈసీ (చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్) అంటే ఏంటి? దీన్ని ఎందుకు ప్రవేశపెట్టారు? మనకు ఎవరికి తెలియని విషయం ఒకటి ఉంది. చైనాకి పడమర వైపున ఉన్న సముద్రాలకు అసలు సంబంధం లేదు. ఒక్క వేళ ఆ సముద్ర భాగంలో ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా భారత్ చుట్టూ మొత్తం తిరిగి అవతల ఉన్న దేశాలకు వెళ్ళాలి. చైనాకు మరో వైపున అన్ని శత్రు దేశాలే ఉన్నాయి.

అవే ఎఎస్ఈఎఎన్ కంట్రీస్ (బర్మా, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, ఫిలిపైన్స్, సింగపూర్, థాయిలాండ్). ఒకవైపు భారత్, మరోవైపు ఎఎస్ఈఎఎన్ కంట్రీస్ దిక్కుతోచని పరిస్థితుల్లో నుంచి పుట్టుకొచ్చిన మాస్టర్ ప్లానే సీపీఈసీ. ఒకవేళ పాకిస్తాన్ నుంచి అరేబియన్ సముద్రానికి రోడ్ లేదా రైల్ మార్గం ఉంటే పని సులభం అవుతుందని ఆలోచించి సీపీఈసీని ప్రవేశపెట్టారు. చైనాలోని కష్గర్ నుండి పాకిస్తాన్‌లోని గ్వాదర్ వరకు ఉచితంగా రోడ్ లేదా రైల్ మార్గం వేయటమే సీపీఈసీ.

ఇవన్ని సాధ్యపడడానికి కావలసిన మౌలిక సదుపాయాలు, అవసరమైయే డబ్బుని చైనా ఈ సీపీఈసీ ఒప్పందం ద్వారా కలిపిస్తుంది. ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పడమర వరకు 160 కీలోమీటర్ల వేగంలో ప్రయాణించగలిగే రైల్ రోడ్స్, 8 లైన్ల ఎక్స్‌ప్రెస్ హైవేస్, కోల్, థర్మల్, సోలార్, హైడ్రో పవర్ స్టేషన్‌లు అన్ని చైనా ఈ సీపీఈసీ ఒప్పందం ద్వారా కల్పిస్తుంది. ఇంతటితో అయిపోలేదు, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్, లాహోర్‌లోని మెట్రో రైల్ ఇలా అన్నిటిని చైనానే చూసుకుంటుంది.

సీపీఈసీకి జమ్మూ కశ్మీర్‌కి సంబంధం ఏంటి? పాకిస్తాన్‌కి చైనాకి బార్డర్ కలవాలంటే కశ్మీర్ ఒకటే మార్గం. ఈ కలయిక సాధ్యమైయేది ఒక్క పీవోకే (పాకిస్తాన్ ఆక్రమించిన కశ్మీర్) నుంచే సాధ్యమవుతుంది. జమ్మూ కాశ్మీర్ మన భారతదేశంలోని భాగమని మనందరికీ తెలిసిన విషయమే. 1947లో పాకిస్తాన్ విడిపోయినప్పుడు చట్టబద్ధంగా జమ్మూ కశ్మీర్ మనకు దక్కింది. కానీ కశ్మీర్‌లోని కొంత భాగాన్ని పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించింది. అంతే కాకుండా ఉత్తరంలోని షక్స్గమ్ ప్రాంతాన్ని 1960లో పాకిస్తాన్, చైనాకి గిఫ్ట్‌గా ఇచ్చింది. అంటే ఆ ప్రాంతం చైనా ఆధీనంలో ఉంది.

క్లుప్తంగా చెప్పాలంటే పీవోకే లేకుంటే పాకిస్తాన్ చైనా మధ్యలో సంభందమే ఉండదు. సీపీఈసీ అనేది ఇటీవల ప్రారంభమైనా ఈ ఆలోచన ఏప్పడిదో. ఈ కారణం హైవే కట్టడం 1959లోనే మొదలైంది. ఈ హైవే 1979లో వాడకంలోకి వచ్చింది. పాకిస్తాన్ మొదట్లో చైనాని అడ్డుకున్నా 1990 తర్వాత పరిస్థితుల్లో చైనాతో సంబంధం పెట్టుకోవటం తప్ప వేరే దారి లేక కారకోరం హైవేని చైనా చేతుల్లో పెట్టింది. అసలు ఈ సీపీఈసీ నుంచి చైనాకి ఏంటి లాభం? పాకిస్తాన్‌లోని గ్వాదర్ అనే ప్రదేశం మస్కట్‌కు 400 కీలోమీటర్ల దూరంలో ఉంది. ఒమాన్, పెర్షియన్ దేశాలకు 500 కీలోమీటర్ల దూరంలో ఉంది.

ఇక్కడ నుంచే గల్ఫ్ ఆయిల్ నిక్షేపాలని తరులుతాయి. ఇక్కడ నుండి సముద్ర మార్గం ద్వారా 12గంటల్లో ఆఫ్రికాని చేరుకోవచ్చు. ఆఫ్రికాలోని సగం కన్నా ఎక్కువ భాగం చైనా చేతుల్లోనే ఉంది. ఎన్నో లక్షల కోట్లు పెట్టుబడి పెట్టింది చైనా ఈ దేశంలో. ఆఫ్రికాలోని సహజ వనరులలో అధిక మొత్తం చైనాకే వెళ్తుంది. ఇవన్ని సాధ్యం అవడానికి కారణం చైనా ఈ దేశాలన్నిటిని వారి వస్తువులతో ముంచేశారు. అతి తక్కువ ధరలకే విలాసాలు దొరుకుతుంటే ఎవరు మాత్రం వద్దంటారు? చైనా వస్తువులని భారతదేశమే వద్దనలేకపోతుంది. మరి చిన్న దేశాల పరిస్థితి ఎంత? ఒకవేళ ఇండియా, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ కలిసి చైనాని ఇండియన్ ఓషన్ వాడుకోనీయకపొతే? చైనాకి ఎలాంటి బాధ ఉండదు.

సీపీఈసీ ఉండడం వల్ల సమయం, డబ్బు అన్ని కలిసొస్తాయి. కాని ఇవన్ని ఇలానే జరుగుతూ ఉండాలంటే పీవోకే పాకిస్తాన్ చేతుల్లోనే ఉండాలి. డబ్బు ప్రమేయం. ఈ సీపీఈసీ వల్ల చైనా ఎన్నో లక్షల కోట్లు పాకిస్తాన్‌పై ఖర్చు పెట్టింది. పాకిస్తాన్‌లో చైనా నిర్మించిన వాటిపై ఎక్కువ హక్కు చైనాకే ఉంది. ఇదొక్కటే కాకుండా పాకిస్తాన్ జీడీపీలో 20% కంటే ఎక్కువ చైనాదే. అంటే పరోక్షంగా పాకిస్తాన్ మొత్తం చైనాదే. ఎంత అంటే పాకిస్తాన్‌ని చైనా వాళ్ళు వల్ల దేశంలో ఒక్క స్టేట్‌లా భావించే అంత. ఇంత డబ్బు, ఇంత సమయం, ఇంత టెక్నాలజీ చైనా పాకిస్తాన్ మీద పెట్టినపుడు ప్రత్యేక్షంగా కాని పరోక్షంగా కాని పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటిస్తే? చైనా ఏం చేయడానికైనా వెనకాడదు.

ఎందుకంటే పరోక్షంగా పాకిస్తాన్ చైనాదే కదా. మరి భారత దేశానికి దీని గురించి తెలియదా? పాకిస్తాన్‌ని ఓడించడం పెద్ద పని కాదు. కానీ, చైనా కూడా ఈ విషయంలో కలగజేసుకుంటే ఒకేసారి రెండు దేశాలతో గొడవకు దిగడం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. వీరితో యుద్ధానికి దిగితే? మన చుట్టూ మనకు సహకరించడానికి ఏ దేశమూ లేదు. ఇదంతా మనకు అర్ధమవ్వాలంటే? ముందు అంతర్జాతీయ రాజకీయాలు ఎలా నడుస్తాయో తెలియాలి. పాకిస్తాన్ విషయంలో అమెరికా, భారత్‌కు మద్దతు ఇస్తుంది. కానీ చైనా విషయంలో ఇవ్వలేదు. అంటే పాకిస్తాన్ తప్పు చేస్తుందని అంటుంది గాని పీవోకే గురించి మాట్లాడదు. ఎందుకంటే? అమెరికా సంస్థలు చైనాలో భారీగా పెట్టుబడి పెట్టాయి.

రష్యా గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు ఆంటే పుతిన్‌కు, రష్యాకు ఆ దేశ సమస్యేలే చాలా ఉన్నాయి. అది కాకుండా భారత్ అమెరికా పాట పాడడం వల్ల రష్యా దూరమైంది. రష్యామద్దతు మాత్రం మనకు ఇవ్వోచ్చు. ఎప్పటిలాగే ఏం జరిగినా మనం నష్ట పోకూడదన్నట్టు యూరోప్ కంట్రీస్ ఏం స్పందించకుండా ఉంటాయి. ఇక మిడిల్ ఈస్ట్ కంట్రీస్ గురించి కూడా ఆలోచించనవసరం లేదు. మతం చూసుకొని పాకిస్తాన్‌కే సపోర్ట్ చేస్తాయి.

అంతర్జాతీయ రాజకీయాలు, అంతర్జాతీయ స్నేహాలన్ని ఇలానే ఉంటాయి. ఒక దేశానికి మద్దతు పలికితే మనకు ఏంటి లాభం, నాకు వచ్చేదేంటి, పోయేదేంటి అనే ఆలోచిస్తాయి. ఇంత పెద్ద చదరంగం ఆటలో పాకిస్తాన్ ఒక్క పావు మాత్రమే. మనకి కనపడుతుంది పాకిస్తాన్ మాత్రమే. పాకిస్తాన్ వారికి ఉన్న వారి దేశాన్నే పరిపాలించే దిక్కు లేదు. ఇక పీవోకే తీసుకొని ఏం చేస్తుంది. అసలు తీసుకోలేదు కూడా! కాశ్మీర్ మీద అసలు చైనా కన్ను పడింది. పీవోకే వల్ల లాభపాడేది చైనానే. కశ్మీర్‌లో ప్రశాంతత లేకుండా ఉండటమే చైనాకి కావాల్సింది. ఒకవేళ అక్కడ ప్రశాంతత నెలకొంటే భారత్ పీవోకేని తిరిగి దక్కించుకుంటుంది. అదే జరిగితే కారకోరం హైవే భారత్ అధీనంలోకి వస్తుంది.

అప్పుడు సీపీఈసీకి అర్ధం లేకుండాపోతుంది. చైనా ప్రత్యేక్షంగా కాని పరోక్షంగా కాని పాకిస్తాన్‌ని సొంతం చేసుకుంది. అలాంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ని వదులుకోదు. కశ్మీర్‌లో జరిగే గొడవలు చైనా సృష్టించినవి కాకపోవచ్చు. కానీ, అవి ఆగిపోతే ఎక్కువగా నష్టపోయేది చైనానే. కశ్మీర్‌లో ఉన్న ప్రజల నీళ్ల సమస్య కన్నా, మతం సమస్య కన్నా, ప్రజలు ఏ దేశంలో ఉండాలి అనే సమస్య కన్నా ఎన్నో రెట్లు పెద్దది చైనా సీపీఈసీ. ఇది ఇలానే కొనసాగాలంటే పీవోకేలో ఎప్పటికి శాంతి ఉండకూడదు.

ఈ అవసరం చైనా కన్నా ఎక్కువ ఇంకెవరికీ లేదు. లేదా పీవోకే పూర్తిగా పాకిస్తాన్‌లో భాగం అయిపోవాలి. అది ఎప్పటికి జరగని పని అని మనందరికీ తెలుసు. మరి భారత్ ఏమైనా చేయగలదా?? అయితే, భారతదేశం చేయగలదు. ప్రతి భారతీయుడు సహకరిస్తే!! ఎందుకంటే భారత ప్రభుత్వం కొన్ని అంతర్జాతీయ ట్రీటీల వల్ల చైనా వస్తువులను నిషేధించలేదు. చైనా ఇపుడు ఆర్థిక తిరోగమనంలో పడింది. గ్లోబల్ ఆర్థికవేత్తల అంచనా ప్రకారం చైనా వారి వస్తువుల ధరలు ఇక తగ్గించి అతి తక్కువ ధరలకే అమ్మనుంది. వారి వ్యాపారాన్ని కాపాడే అతి పెద్ద మార్కెట్ ఉన్న దేశం భారతదేశమే.

ప్రతి సంవత్సరం 60 లక్షల కోట్లు మన డబ్బు చైనాకి వెళ్తుంది. ఊహించడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షర సత్యం. అందుకే మనం చైనా వస్తువులు కొనకపోతే చైనా ఆర్థిక వ్యవస్థ ఊహించని విధంగా దెబ్బతింటుంది. మనం మన దేశంలో తయ్యారయ్యే వస్తువులు కొనటం వల్ల మన ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇదే కనుక మనం ఎప్పటికి కొనసాగించగలిగితే మనం చైనాని ఆదేశించే రోజు త్వరలోనే వస్తుంది.