విజయవాడ, ఆగస్టు 31 (న్యూస్‌టైమ్): కృష్ణా జిల్లా తిరువూరు పట్టణంలో తంగేళ్లబీడులో కనపర్తి రేణుక అనే పాత నేరస్తురాలు నివాసంలో విజయవాడ నగర శివారు పోరంకికి చెందిన వీఆర్వో అవనిగడ్డ గణేష్ (46) దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని హత్య జరిగిన ప్రాథమిక సాక్ష్యాలు సేకరించే పనిలో పడ్డారు. మృతుడు గతంలో ఆగిరిపల్లి మండలంలో వీఆర్వోగా చేస్తూ ఈ సవంత్సరం ఫిబ్రవరి నెల నుండి ఉద్యోగానికి సెలవులో ఉన్నాడు.

ఈ రోజు తిరువూరు హత్యకు గురికావడంతో స్థానికంగా సంచలనం కలిగించింది. ఈ సందర్భంగా నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ హత్యకు పాల్పడిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నిందుతురాలిపై గతంలో పలు నేరాలు నమోదు అయినట్లు డిఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.