* సాహసవంతుడి వరకూ అదృష్ట దురదృష్టాలు కుడి ఎడమల లాంటివి. అతడు రెండింటినీ వాడుకుంటాడు.
* సుదీర్ఘమైన అనుభవంపై ఆధారపడి వున్న చిన్న వాక్యమే సామెత.
* మన వద్ద ఉన్న వస్తువును పోగొట్ట్టుకోనంతవరకు ఆ వస్తువు విలువను మనం తెలుసుకోలేము.
* నిప్పు, నీరు – ఈ రెండు మంచి సేవకులు. కానీ చాలా చెడ్డ యజమానులు.
* గొప్పపనలు చేయడానికి కావలసింది ముఖ్యంగా శక్తికాదు – ఓపిక.
* శ్రమవల్ల లభించేది గొప్ప బహుమానం కానే కాదు. శ్రమవల్ల వచ్చే మార్పే గొప్ప బహుమానం.