• మీ రాశి ప్రకారం మీ అంతరాత్మ?

  • మనస్ధత్వాన్ని అంచనావేయడం సులువే!

ఎదుటివాళ్లతో మాట్లాడితే వాళ్ల గురించి ఓ అంచనాకి వస్తాం. ఎదుటివ్యక్తితో దగ్గర సంబంధం ఉంటే వాళ్ల ఆలోచనలు కూడా తెలుసుకోవచ్చు. వాళ్ల వ్యక్తిత్వం, మనస్తత్వం, స్వభావం అన్నీ ఐడియా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఎదుటివ్యక్తితో దగ్గరి రిలేషన్ ఉంటుంది. కానీ వాళ్ల ఆలోచనలను అంచనా వేయలేకపోతాం. వాళ్ల మెంటాలిటీ అంతుచిక్కకుండా పోతుంది. ఎంత స్నేహంగా ఉన్నా కూడా కొందరి నేచర్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేం. అయితే రాశిని బట్టి వాళ్ల మనసులోని ఆలోచనలు పసిగట్టవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఎలాంటి సందర్భంలో ఎలాంటి మైండ్‌సెట్ ఉంటుంది? ఏ యే విషయాలకు వాళ్లు ఇంపార్టెన్స్ ఇస్తారు? అనేది తెలుసుకోవచ్చట.

కొన్ని సందర్భాల్లో మీ ఆలోచనలే మిమ్మల్ని తికమకపెట్టేస్తుంటాయి. అయితే, మీ రాశిని బట్టి మీ మనసుని, మీ మనసులో మెదిలే ఆలోచనలను అంచనా వేయవచ్చు. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ వివరాలు చూడాల్సిందే. మేషరాశివారు ప్రపంచాన్నిఅంతా వారే నడిపిస్తున్నట్లుగా ఉంటారు. తలబిరుసు వైఖరి కలిగి ఉంటారు. అయితే వీరు మొండిగా, కొద్దిగా గర్వంగా ఆధిపత్యం ప్రదర్శించే విధంగా, ఇతరులను కించపరిచే విధంగా ఉంటారు. ఇతరులు ఏమి చెపుతున్నారో వినండి. గుర్తుంచుకోండి. వృషభరాశివారు ఒక క్షణం మొండి పట్టుదలగలవారుగా కనిపిస్తారు, కానీ విషయాలు వారి నచ్చిన మార్గంలోనే చేయటానికి ఇష్టపడతారు. విధేయత, నమ్మకం వీరికి ముఖ్యమైనవి.

సాధ్యం కానిది ఏది లేదని గుర్తుంచుకోండి. కొన్నిసార్లు ఇతరుల అభిప్రాయాలు కూడా చాలా పనిచేస్తాయి. మిథునరాశివారు స్ప్లిట్ పర్సనాలిటీకలవారు. పూర్తిగా వీరి ఆలోచనలు ఇవి అని చెప్పడం చాలా కష్టం. వీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఎక్కువగా వీరు మంచి సమయం కోసం చూస్తుంటారు. కర్కాటక రాశివారు వారి మెత్తటి మనసును బహిర్గతం చేయటానికి ఇష్టపడరు, కానీ క్రాబీ షెల్ వంటి కఠినతకు ప్రాధాన్యతనిస్తూ అన్ని సమయాల్లోనూ రక్షించుకుంటారు. మీ ప్రేమను కావాలనుకునే వారికి పంచండి. ఇతరులను మిమ్మలిని ప్రేమించటానికి అనుమతించండి. మిమ్మలిని మీరు ఎక్కువగా దాచుకోకండి.

సింహరాశివారు వెనక్కు తగ్గరు. ఎక్కడైనా, ఏ విషయమైనా వారు కేంద్రమై ఉండాలి అని అనుకుంటారు. ఆ విషయాన్ని బహిర్గతం చేస్తారు కూడా. వీరు కొద్దిగా గడుసైనవారుగా, చెడ్డవారీగా, మొండివారుగా కనిపిస్తారు. వీరు చాలా బలమైన భావాలను కలిగిఉంటారు. కన్యారాశివారు తార్కికంగా ఆలోచిస్తారు. ఒక వేళ మీరు పెద్ద సమస్యతో ఇబ్బందిగా పని చేస్తున్నట్లయితే ఈ రాశివారు గొప్ప వ్యక్తులుగా మీకు సాయపడతారు. మీరు మరీ తార్కికంగా మీ సహానుభూతిని కోల్పోయి ఆలోచించకండి. తులరాశివారు నిరంతరం సంతులనం పాటిస్తూ ప్రేమ మరియు పనిని సృష్టించుకుంటారు.

ఇదే వారి మెదడులో కూడా నడుస్తుంటుంది. వారి ఆనందాన్ని సృష్టించుకుంటారు. కేవలం అదే వెంట రావాలని ఆశించరు. ప్రజలు తరచుగా వృశ్చికం వైఖరిని చూసి ముప్పుగా భయపడుతుంటారు. వీరు ఒక క్షణం అనుమానాస్పదమనిపిస్తారు. వారితో ఒక లోతైన సంభాషణ జరిపిన తరువాత వీరిని పూర్తిగా తెలుసుకోలేము అని అనిపిస్తుంది. వారు రెండవ సెకండులో వేరేగా మారవచ్చు. ధనుస్సురాశివారు చాలా బలమైన, అగ్నివంటి మనసు కలవారిగా ఉంటారు. వీరు సాహసప్రియులు, నూతన చర్యలు అవసరం. వారు వీరికి మంచి ఆలోచనలతో ఉన్నవారు తోడుగా ఉండటం అవసరం. మకరరాశివారు వారి అంతర్గత ఆలోచనలను పక్కనపెడతారు. కేవలం ఉద్యోగం పొందడానికి. వీరు అధికంగా శ్రమిస్తారు.

కానీ, మీరు మకరరాశివారు అయితే, మీ చేసే పని ద్వారా ఆలోచించడం మర్చిపోవద్దు! కుంభం సహజంగా స్వీయ నియంత్రణ గలవారు, వీరి భావాలను తార్కికంగా ఆలోచించటానికి ఇష్టపడతారు. లేవండి, ప్రయాణం చేసి క్రొత్త సంస్కృతులను మరియు ఆలోచనలు అనుభవించండి. ప్రపంచంలోని వివిధ అంశాలను మీ మనస్సును తెరిచి చూడనివ్వండి. మీనరాశివారు ప్రతి సమస్య సొంతం అనుకోవటాన్ని ఇష్టపడతారు. వీరు ఊసరవెల్లులవంటివారు. నిరంతరం వారి మనసు మార్చుకుంటూ ఉంటారు. వీరు మనసులో చాలా సున్నితమైనవారు, జాగ్రత్తగా ఉంటారు.