చెన్నై, సెస్టెంబర్ 8 (న్యూస్‌టైమ్): ‘మేకిన్ ఇండియా’లో భాగంగా బుల్లెట్ రైలు తరహాలో ఉండే ఇంజిన్ రహిత రైలును భారత్ తయారు చేసింది. ట్రయల్ రన్ కోసం ఈ రైలు పట్టాలు ఎక్కింది. ఈ రైలు నమూనా రూపకల్పన, తయారీ తదితర పనులన్నీ భారత్‌లోనే జరిగాయి. ఇంజిన్ ఉండని ఈ రైలులో ఎన్నో ప్రత్యేకతలూ ఉన్నాయి. 16 ఏసీ బోగీలతో ఉండే ఈ రైలు ప్రతి బోగీలో 6 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. డ్రైవర్ సీటు బయట ఓ సీసీటీవీ కెమెరా ఉంటుంది.

దీని ద్వారా బోగీలోని ప్రయాణికులను పర్యవేక్షించవచ్చు. రైలులోని రెండు ఎగ్జిక్యూటివ్ బోగీల్లో స్పెయిన్ నుంచి తెప్పించిన సీట్లను వాడారు. ఈ సీట్లు 360 డిగ్రీల కోణంలో గుండ్రంగా తిరుగుతాయి. దివ్వాంగులుకు అనుకూలంగా ఉండే మరుగుదొడ్లు, పసి పాపల సంరక్షణకు ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి. ఈ రైలును రూ.100 కోట్లతో 18 నెలల్లో తయారు చేశారు.

గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. చెన్నైలో ఆదివారం ఆదివారం ప్రారంభమైన ఈ రైలు ట్రయిల్ రన్ దేశరాజధాని ఢిల్లీ వరకూ నిరంతరాయంగా కొనసాగనుంది. అనంతరం ఈ రైలును ప్రయాణీకుల అవసరార్ధం పట్టాలు ఎక్కించనున్నారు. ‘ట్రైన్ 18’గా పిలిచే ఈ రైలు ఇంజిన్‌తో పనిలేకుండా కేవలం కోచ్‌లతో మాత్రమే నడుస్తుంది. ప్రస్తుతం ఇండియాలో అత్యంత వేగవంతమైన రైలు ఢిల్లీ-భోపాల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్. ఇది గంటకు సుమారు 150 నుంచి 155 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ వేగాన్ని తట్టుకోగలిగే సామర్థ్యం కేవలం ఢిల్లీ-భోపాల్ మధ్య ట్రాక్‌లకే ఉంది.

ఈ నేపథ్యంలో ‘ట్రైన్ 18’ను ముందుగా ఈ రూట్‌లోనే నడపాలని నిర్ణయించారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)‌లో దేశీ పరిజ్ఞానంతో దీన్ని తయారు చేశారు. ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల తరహాలో ఈ రైలుకు ప్రత్యేకంగా లోకోమోటివ్ ఇంజిన్ ఉండదు. రెండు ఎగ్జిక్యూటివ్‌ కోచ్‌లతో కలిపి మొత్తం 16 ఏసీ బోగీలు ఉంటాయి. ఒక్కో బోగీలో మొత్తం 78 సీట్లు ఉంటాయి. ఇవి 360 డిగ్రీల కోణంలో తిరగడం వీటి ప్రత్యేకత. మెట్రో రైలు తరహాలో కేవలం లోకో పైలట్ క్యాబిన్ మాత్రమే ఉంటుంది.

ఇందులో వైఫై సదుపాయం కూడా ఉంటుంది. ఎల్ఈడీ స్క్రీన్లు కూడా ఉన్నాయి. రూ.100 కోట్ల వ్యయంతో ఈ రైలును నిర్మించారు. కోచ్‌లకు ఆటోమెటిక్ స్లైడ్ డోర్లు ఉంటాయి. కేవలం ప్లాట్‌ఫాంలు వచ్చినప్పుడు మాత్రమే ఇవి తెరుచుకుంటాయి. ఎల్‌ఈడీ స్క్రీన్లు, అధునాతన టాయిలెట్లు ఇంకా ఎన్నో హంగులతో ఈ రైలు సిద్ధమవుతోంది. ఇది విజయవంతమైతే మిగతా ప్రాంతాల్లో సైతం ‘ట్రైన్ 18’ రైళ్లను ఇంటర్ సిటీ రైళ్లుగా నడపాలని ప్రభుత్వం భావిస్తోంది.

గత ఏడాది నవంబరు 7న ఈ రైలు ఢిల్లీకి చేరుకుని అక్కడ నుంచి మొరదాబాద్‌-బరేలి స్టేషన్ల మధ్య మరోసారి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. అనంతరం కోటా-సవాయ్‌ మాధోపూర్‌ ప్రాంతంలో మరో ట్రయిల్ నిర్వహించారు. దీన్ని హౌరా-ఢిల్లీ మధ్య నడపాలనే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది.