చిత్తూరు, సెస్టెంబర్ 10 (న్యూస్‌టైమ్): శ్రీకాళహస్తీశ్వరాలయంలో అయిదు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయంలో ఏటా నిర్వహించే ఈ విశేషోత్సవాలు ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

పంచమూర్తుల దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఇక్కడి వాయులింగేశ్వరాలయంలో శ్రీజ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామితో పాటు పరివార దేవతామూర్తులకు అర్పించే నివేదన, ధూప, దీప, కైంకర్యాల్లో ఎలాంటి లోపాలు జరిగినా, తెలిసి, తెలియక జరిగిన తప్పులను క్షమించమని కోరుతూ దేవదేవుని ఆరాధించే విశేషోత్సవాలే ఈ పవిత్రోత్సవాలు.

ఇందులో భాగంగా శ్రీకాళహస్తిదేవస్తానములో శ్రీ(సాలీడు), కాళ (పాము), హస్తి (ఏనుగు)లతో పాటు భరద్వాజమహర్షికి సంకల్ప పూర్వక అభిషేకాలు, విశేష పూజలు, నిర్వహించారు. ఆలయ ఆవరణలోని యాగశాలలో అయిదు రోజుల పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో వ్రతచరి, ఉపచార పూజలు నిర్వహించానున్నారు.