ఔను… ఆ సామాజిక వర్గం నరనరానా ఉంది సాయం చేసే గుణం. తమను ఆశ్రయం కోరి వచ్చినవారిని అక్కున చేర్చుకునే బోళాశంకరులు కాళింగులు. యావత్ భారతావణిలోనే తమ కులానికి ఓ ప్రత్యేకతను సాధించిపెట్టుకున్న కాళింగ సామాజిక వర్గం నుంచి ఎందరో రాజ్యాధికారం వైపు అడుగులు వేశారు. నాటి బొడ్డేపల్లి రాజగోపాల్ దగ్గర నుంచి నిన్న మొన్నటి డాక్టర్ కిల్లి కృపారాణి వరకూ చట్టసభల్ని చుట్టొచ్చినవారే.

రాజకీయాల్లోకి వచ్చాక ఎవరి పార్టీ సిద్ధాంతాలు వారికుంటాయనుకోండి. కానీ, ఎక్కడో చిన్నచిన్నవి మినహా కులంలో కుమ్ములాటలు జరగని సామాజిక వర్గంగా కూడా కాళింగులకు గుర్తింపు ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని బలమైన సామాజిక వర్గాలలో ఒకటిగా నిలిచి ఉనికిని చాటుకున్న కాళింగులు నేడు అన్ని రంగాలలో కీలకంగా మారారు.

2011 మార్చి 8 నాటికి పలు వెనుకబడిన కులాలను ఉమ్మడి జాబితాలోకి చేరుస్తూ అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అప్పటి వరకూ కేంద్ర జాబితాలో వేర్వేరుగా ఉన్న కులాలను తాజాగా ఒకే కేటగిరిలోకి చేర్చుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు పాలకులు. దీంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కాళింగ కులస్తులు ఒకే గొడుగు కిందకు వచ్చినట్లయింది. వీరందరినీ ఒకే తరగతిగా ప్రస్తుతం పరిగణిస్తున్నారు.

దీని ప్రకారం పందిర కాళింగ, కింతలి కాళింగ, బోరగాన కాళింగ కులస్తులు కాళింగులుగా కొనసాగుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 1.44 లక్షల మంది కింతలి కాళింగ, 38 వేల మంది బోరగాన కాళింగులు ఓటర్లుగా ఉన్నారు. కింతలి కాళింగులు అత్యధికంగా ఆమదాలవలస, పొందూరు, టెక్కలి, సంతబొమ్మాలి, నందిగాం, పలాస, సరుబుజ్జిలి తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. ఇక, బోరగాన కాళింగులు కవిటి, ఇచ్చాపురం, సోంపేట, గార, వజ్రపు కొత్తూరు, మందస తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల ఉప కులాల వారు కూడా రిజర్వేషన్లపరంగా ప్రయోజనం పొందుతున్నారు. కేంద్ర నిర్ణయంతో దాదాపు 1.82 లక్షల మందికి ప్రయోజనం కలిగింది.

ఇక, కాళింగుల సామాజిక స్వరూపం విషయానికి వస్తే, 1891లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర జనాభా లెక్కల ప్రకారం ఒడిశాలో కాళింగ కులం (జాతి) ఉనికి అధికారికంగానే లభించింది. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం దీనిని రికార్డుల్లో పొందుపరచింది కూడా. సదరు సెన్సస్ ప్రకారం తెలుగు ప్రాంతాల్లో ‘కాళింగ’ అన్న పదం ఒరియా భాషలో ‘కలింజి’ అంటారని పేర్కొంది.

రెండింటికీ అన్ని రకాల సారూప్యాలు సరాసరి ఒకే విధంగా ఉన్నయనేది బయటపడిన నిజం. కాళింగులు కేవలం ఒక జిల్లాకు మాత్రమే పరిమితమన్న కొందరి వితండవాదానికి ఇది చెంప పెట్టు లాంటిదనే చెప్పాలి. రెండు విభిన్న రాష్ట్రల్లో తమ సామాజిక వర్గం (కులం) ఉందని కాలరెగరేసుకుని చెప్పుకోవచ్చు కాళింగులు. ఇండోనేషియాలో ఒకనాడు సొంతంగా రాజ్యం ఏర్పాటు చేసుకుని, నేటికీ అక్కడ ఒక జిల్లాకు ‘కలింగ’ అనే పేరుతో మన ఉనికి చాటుకుంటున్నమని గర్వంగా చెప్పండి.

మలేషియాలో కొన్ని వీధులకు కాళింగ కులం పేర్లున్నాయని ఎలుగెత్తి చాటండి. అఖండ భారత చక్రవర్తి అశోకుడిని ఎదిరించి భీతిగొల్పిన జాతి తమదని గొంతెత్తి అరవండి. మహాభారత యుద్దం నాటికే భలీయంగా ఉన్న జాతి కళింగ జాతి. ఈ ప్రాంతంలో ఏ ఇతర కులానికైనా ఇంతటి చారిత్రక నేపధ్యముందా? కాళింగ చరిత్రను చూసి సహించలేని కొందరు కుహనా రచయితలూ, నయా కవులు కళింగ అనేది ఒక ప్రాంతం పేరని, ఇది కులం కాదని చెప్పుకొచ్చారు.

ఆనాటి వీరోచిత లక్షణాలు కేవలం ఈ సామాజిక వర్గంలో మాత్రమే ఉన్నట్లు చరిత్రకారులు చెబుతారు. మాటకు నిలబడే తత్వం ఈ కులం సొంతం. బహుశా, అందుకేనేమో కాళింగులా మజాకా? అన్నది. కాళింగుల కాళ్ళు పట్టుకుని ఓట్లేయించుకుని పదవులు పొందిన వారెందరో. ఈ సామాజిక వర్గం మద్దతు లేకుండా ఎవరి విజయం సాధ్యం కాదన్నది నిజం. కానీ, కాళింగులకు కులాల పట్టింపు లేదు, మానవత్వం తప్ప. ‘కళింగ’ అంటే ‘సముద్రపు పలక’ అని అర్దం. ఎల్లలేరగని సముద్రాన్ని టేపుతో కొలుస్తామనడం ఎంత వెర్రి తనమో, ఈ వర్గం హృదయాలను అంచనావేయడమూ అంతే వెర్రితనం.

చరిత్ర ప్రారంభంలో ‘కళింగ’ అనే పేరు ఉన్నప్పటికీ తరువాత పలువురు రాజులు మాడం, బ్రిటిష్ పాలనలో ‘సికాకోల్’ చిక్కోల్, శ్రీకాకుళం అని పేరు మార్పు చెందినట్లు ప్రాంతాలూ, భాషలకనుగుణంగా చిన్న మార్పులకు గురైంది. కళంజి, కళింగ అని చెప్పబడుతున్న రెండు వర్గాల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. అప్పటి గంజాం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల్లో భాగంగా ఉన్న విశాల భూ భాగంలో పూర్తి స్థాయిలో కళింగులు నివసించేవారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో శ్రీకాకుళం జిల్లాలో కొందరు ఉండిపోగా అధిక భాగం ఒడిశాలో ఉందిపోయారు. ఇది భౌగోళిక పరిస్థితుల రీత్యా జరిగిన పరిణామం.

పూర్వ కాలం నుండి ఇరు ప్రాంతాల్లోనూ కళింగ/కళింజీలు ఆలయాల్లో పూజార్లుగా పూజధికాలు నిర్వహించేవారు. ఆచార వ్యవహారాలు, గోత్రాలు, ఇంటి పేర్లూ వంటివాటిలో సారూప్యత కనిపిస్తోంది. బ్రిటిష్ రికార్డుల ప్రకారం, కాళింగలో కింతల్లి, బూరగాం, పందిరి (వీరినే ఒడిశాలో బెవరానీ కాళింగులని అంటారు) మొహిరీ (ఒడియాలో మొహిరీ కలింజి) గవుడ్ కళింగా కుళాలు ప్రధానమైనవిగా అప్పటి రికార్డులు పేర్కొంటున్నాయి. వీరిలో బోడ కళింగ (కళింజ)లు దారి దోపిడీలకు పాల్పడేవారని, పూరీ రాజు వీరి పరాక్రమాన్ని పసిగట్టి సైనిక దళపతులుగా నియమించుకున్నారనీ చారిత్రక కధనాలు. మొహిరీ కలింజి గంజాం జిల్లలో వెల్ నవున్ డివిజన్. కళింగ పెద్దలను నాకబారి అని, శాంతో అనేవారట. సహాయకులను పాత్రో అనేవారట.

ఒడిశాలో సుబెద్ది, పాత్రో, చౌదరి, బిసోఈ, నాయురాలు, నాయుడు, పొధనొ, జెన్న, స్వయె, నాయకో, బెహర, గౌడో అని పేరు చివర నామదేయాలున్నవారు కాళింగులుగా బ్రిటిష్ రికార్డులు (1891) చెబుతున్నయి. వాస్తవానికి పేరు చివర లేదా పేరు ముందు ఇటువంటి నామదేయాలు ఇరు ప్రాంతాల్లోనూ నేటికీ ఉన్నాయి. పెళ్లిళ్ల సమయంలో ఇంటిపేర్లూ, గోత్రాలూ చూసుకుని సంబంధాలు చేసుకోవడం ఒకే విధంగా ఉంటాయని వీరు పేర్కొన్నారు. ఇదంతా ఒకే కులమని, ఇందులో కాశ్యప, భారద్వాజ గోత్రాలు క్ష్యత్రియ, బ్రహ్మణ గోత్రాలనీ, అందుకే ఈ రెండు గోత్రాలకు చెందినవారు పూజాధికాలు ఎక్కువ చేస్తుంటారని పేర్కొన్నారు.