విశాఖపట్నం, సెస్టెంబర్ 29 (న్యూస్‌టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయం విద్యా విభాగం పరిశోధక విద్యార్థి కర్రి లక్ష్మీనారాయణకు వర్సిటీ డాక్టరేట్‌ లభించింది. విభాగ ఆచార్యులు టి.షారోన్‌ రాజు పర్యవేక్షణలో ‘ఏ స్టడీ ఆన్‌ ద కాంపిటెన్సీ ఆఫ్‌ టీచర్స్‌ ఇన్‌ సెకండరీ స్కూల్స్‌ ఆఫ్‌ విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్‌’ అనే అంశంపై జరిపిన పరిశోధనకు డాక్టరేట్‌ లభించింది.

విశాఖ జిల్లా పాఠశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు కాంపిటెన్సీ(యోగ్యత) అంశంపై జరిపిన పరిశోధనకు డాక్టరేట్‌ లభించింది. వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తన కార్యాలయంలో లక్ష్మీ నారాయణకు డాక్టరేట్‌ ఉత్తర్వులను అందజేసి అభినందించారు.