కాలం ఏదైనా గర్భంతో ఉన్నవారికి కొంచెం ఇబ్బంది కరంగా ఉంటుంది. ఎందుకంటే శరీరంలో హార్మోనుల్లో అనేక మార్పులు మరియు ఈస్ట్రోజెన్‌ ఎక్కువగా పెరగడం వల్ల వేసవి కాలం మరింత ఇబ్బంది కరంగా ఉంటుంది. అదే సమయంలో మన ఇంట్లో ఉండే ఎయిర్‌ కండీషనర్‌ ఎంత ఎక్కువ ఉంటుందో కూడా మనకు తెలియదు, అయినా కూడా వాతావరణం చాలా హాట్‌గా ఉంటుంది. వేసవి కాలంలో కంటే శీతాకాలంలో గర్భం పొందడం చాలా ప్రశాతంగా ఉంటుంది. కాబట్టి, వేసవికాలంలో గర్బం పొందిన వారు తప్పనిసరిగా కొన్ని సమ్మర్‌ టిప్స్‌ను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది.

వేసవి కాలంలో ఏపనిచేయాలన్నా చిరాకు పెడుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, తల్లి బరువుతో పాటు కడుపులో పెరిగే బిడ్డ బరువును కూడా తల్లి మోస్తుండటంతో కొంచెం ఇబ్బందికరంగా భావించడం, హార్మోనుల మార్పలతో శరీరంలో వేడి ఆవిర్లు, వంటివి మరింత ఇబ్బంది కలిగిస్తాయి. సాధారణంగా మహిళలు గర్బం పొందిన తర్వాత వారిలో సాధరణంగా కంటే బాసల్‌ టెంపరేచర్‌ మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఈ బాల్‌ టెంపరేచర్‌కు వాతవరణం వేడి కూడా జత అయితే ఇక ఆ పరిస్థితి వివరించడానికి కూడా వీలులేకున్నంత ఇబ్బందికరంగా, అసౌకర్యంగా ఉంటుంది.

అయితే వేసవి కాలంలో ఎక్కువగా స్విమ్మింగ్‌ పూల్‌లో గడపడం, చలికాలంలో లాగా మందంగా ఉన్న దుస్తులు దరించడం, స్వెటర్లు, స్కార్ఫుల్‌ వంటి వాటితో కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో గర్భిణీలు, సౌకర్యవంతమైన వదులుగా ఉండే దుస్తులను మాత్రమే ధరించాలి. అలాగే చాలా తేలికగా ఉండే ప్రింటెడ్‌ షిఫాన్‌, కాటన్‌ దుస్తులు మీ అందాన్ని మరింత రిఫ్రెష్‌ చేస్తుంది. మరోవైపు, వయసు మీద పడుతున్న కొద్దీ పొట్ట కూడా పెరగటం సహజమే. పురుషులు పెద్దగా పట్టించుకోకపోవచ్చు గానీ ఇది ఎంతోమంది స్త్రీలకు పెద్ద సమస్యగానే పరిణమిస్తుంది.

శరీరాకృతినే మార్చేసి మరింత వయసు ముదిరినట్టు చేస్తుంది మరి. ఇది అందానికే కాదు ఆరోగ్యానికీ చేటు కలిగిస్తుంది. శరీరంలో మిగతా భాగాల్లోని కొవ్వు కన్నా పొట్ట మీద పేరుకునే కొవ్వు చాలా ప్రమాదకరమైంది తెలుసా? ఇది గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు రావటానికీ దోహదం చేస్తుంది. అలాగని బాధ పడుతూ కూచోకుండా జీవనశైలిలో మార్పులు చేసుకోవటంతో పాటు కొన్ని రకాల వ్యాయామాలు చేయటంతో దీనిని తగ్గించుకునే ప్రయత్నం చేయటం చాలా అవసరం. వయసు పెరుగుతున్న కొద్దీ జీవక్రియలు మందగిస్తుంటాయి. దీంతో శరీరంలో కొవ్వు మోతాదూ నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. పురుషుల్లో కన్నా స్త్రీలల్లోనే ఇది ఎక్కువ.

మెనోపాజ్‌ అనంతరం చేతులు, కాళ్లు, తొడల వద్ద కొవ్వు తగ్గిపోతూ పొట్ట దగ్గర పేరుకుపోవటం ప్రారంభిస్తుంది. కడుపుని పట్టుకున్నప్పుడు చర్మం కింద చేతికి తగిలే కొవ్వు కన్నా లోపల అవయవాల చుట్టూ పేరుకునే కొవ్వు ఇంకా ప్రమాదకరం. ఇది వంశ పారంపర్యంగానూ రావొచ్చు. ముట్లుడిగిన తర్వాత కలిగే హార్మోన్ల మార్పు కూడా దీనికి దోహదం చేస్తుంది. బరువు పెరగకుండా బొజ్జ పెరుగుతున్నా ప్రమాదకరమే. అధిక పొట్టతో ఎదురయ్యే అనర్థాలు: బొజ్జ మూలంగా రకరకాల జబ్బులు దాడి చేసే ప్రమాదముంది. గుండె జబ్బులు, రొమ్ము క్యాన్సర్‌, మధుమేహం, జీవక్రియల అస్తవ్యస్తం, పిత్తాశయ సమస్యలు, అధిక రక్తపోటు, పెద్దపేగు క్యాన్సర్‌.