• ఈ ఏదాది నుంచే ప్రక్రియ ప్రారంభానికి ఏపీలో రంగం సిద్ధం?

  • జాతీయ స్థాయిలో కేంద్రం అనుసరిస్తున్న తరహాలో విధివిధానాలు

  • సీనియర్ జర్నలిస్టుల విజ్ఞప్తి మేరకు సమాచార మంత్రిత్వ శాఖ కసరత్తు

ఇప్పటి వరకూ జాతీయ స్థాయిలో కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే గుర్తించిన వెబ్ జర్నలిజాన్ని త్వరలో తెలుగు రాష్ట్రాలు కూడా గుర్తించనున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోను, రాష్ట్ర విభజన తర్వాత కూడా ప్రభుత్వాలు ఈ విషయాన్ని పక్కనపెట్టి సీనియర్ జర్నలిస్టులకు ఫ్రీలాన్సర్లగానో, లేక వేరే పత్రికలు, మీడియా పేరిటో ఉదారంగా అక్రిడిటేషన్లను జారీచేస్తూ వారి సీనియారిటీని గుర్తిస్తూ వస్తున్నాయి.

కానీ, ఇక మీదట నేరుగా వెబ్ జర్నలిజాన్ని పూర్తి స్థాయి వృత్తిగా స్వీకరించి ఇదే రంగంలో అనుభవం ఉన్న వారికి ప్రస్తుతం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు, న్యూస్ ఏజెన్సీలకు ఇస్తున్న మాదిరిగా అక్రిడిటేషన్లను జారీచేసి ప్రత్యేక గుర్తింపును ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలలో ప్రచారం జరుగుతోంది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేసే ప్రెస్ ఇన్ఫర్‌మేషన్ బ్యూరో (పీఐబీ) జాతీయ స్థాయిలో గత అయిదారేళ్ల నుంచి అక్రిడిటేషన్లను జారీచేస్తూ వస్తోంది.

అదే విధంగా కేంద్రంలో నరేంద్రమోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక అర్హత ఉన్న ఆయా వెబ్‌సైట్లకు ప్రకటనలు జారీచేసేందుకు సంబంధించిన రేట్ కార్డులను కూడా ఇస్తోంది. ఈ ప్రక్రియను ప్రస్తుతం ‘బ్యూరో ఆఫ్ అవుట్రీచ్ అండ్ కమ్యూనికేషన్’గా పేరుమార్చుకున్న ‘డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ (DAVP)’ ‘కొత్త మీడియా (New Media)’ పేరిట నిర్వహిస్తోంది.

ఈ నేపథ్యంలో యూట్యూబ్‌ ఛానళ్లను ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు? సొంతంగా డొమైన్ కలిగిన వెబ్‌సైట్లు, వెబ్ ఛానళ్లకు, ఆన్‌లైన్ పోర్టళ్లు, ఈ-పేపర్లకు ఇస్తున్న మాదిరిగా కేంద్ర ప్రభుత్వం యూట్యూబ్ ఛానళ్లకు ప్రకటనలు ఎందుకు ఇవ్వడం లేదు? అక్రిడిటేషన్ల జారీలో సమాచార, పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ యూట్యూబ్ ఛానళ్లను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు? చివరికి లోకల్ కేబుల్ టీవీ నెట్‌వర్క్‌లను సైతం గుర్తించి ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న యూట్యూబ్ ఛానళ్లను ఎందుకు విస్మరిస్తోంది? ఆయా వెబ్ సైట్లు, ఛానళ్లలో పనిచేసేవారు జర్నలిస్టులు కాదా? వంటి ప్రశ్నలు, సందేహాలూ సగటు పాత్రికేయునికి గడచిన నాలుగైదేళ్ల నుంచి వస్తున్నవే అయినా, ప్రభుత్వాలు వాటిపై పెద్దగా దృష్టిపెట్టలేదు.

కానీ, ఈసారి వెబ్ మీడియా, సోషల్ మీడియా ప్రాచుర్యాన్ని, విస్తరిస్తున్న తీరునూ గుర్తించేందుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించినట్లు సమాచారం. దీనికి సంబంధించి రెండు రాష్ట్రాల్లోనూ సీనియర్ జర్నలిస్టులు (ప్రస్తుతం వెబ్ జర్నలిజంపై ఆధారపడ్డవారు) ప్రభుత్వాలపై తీసుకువచ్చిన వత్తిడి నేపథ్యంలో సమాచార శాఖ అధికారులు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

అయితే, ఆయా వెబ్ సైట్లను, ఛానళ్లను గుర్తించే ప్రక్రియ ఎలా చేపట్టాలన్నదానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం కేంద్రం అనుసరిస్తున్న విధివిధానాల ప్రకారం చూస్తే వెబ్ సైట్/వెబ్ పోర్టల్ లేదా వెబ్ ఛానల్ రోజుకు కనీసం ఆరుసార్లు అప్‌డేట్ కావాల్సి ఉంది. ఆ విధంగా చేస్తున్న వారు తెలుగు రాష్ట్రాలలో చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పవచ్చు. సైట్ అప్‌డేషన్ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వ గుర్తింపు విషయంలో నష్టపోవాల్సి వస్తుందని ఎవరన్నా చెప్పినా కొంత మంది తెలిసీ తెలియని వెబ్ సైట్, వెబ్ ఛానల్ నిర్వాహకులు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తమకు అనుకూలంగా మార్చుకుని రోజుకు ఆరు పోస్టులు పెడితే సరిపోతాయిలే అంటున్నారు.

‘రోజులో కనీసం ఆరు సార్లు సైట్ అప్‌డేషన్ జరగాలి’ అంటే ఆరు ఐటమ్స్ పోస్టు చేయడమంటే ఎలా? అందుకే ఇలాంటి వారి విషయంలో సడలింపులు ఇవ్వరాదన్న సూచనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో యూట్యూబ్ ఛానళ్ల పేరిట వర్ధిళ్లుతున్న లోగోల దందాలో సమిధలు కాకుండా ఉండాలంటే సొంత రిజిస్టర్డ్ డొమైన్ కలిగిన వెబ్‌సైట్/వెబ్ ఛానల్/ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్/ఈ-పేపర్ తప్పనిసరని ఇప్పటికైనా గుర్తించండి!

నకిలీ జర్నలిస్టులుగా మారకండి… బోగస్ ఛానళ్లను నమ్మకండి… స్వశక్తిని నమ్ముకోండి… స్వయంకృషితో ఎదగండి! లోగోల మాయాజాలంలో పడి మచ్చతెచ్చుకునే కంటే మీకంటూ ఓ ఉపాధి మార్గాన్ని ఎంచుకోండి! ‘కంటెంట్ ప్రొవైడర్’గా అవతరించి సొంత సంపాదనపై మనసు నిమగ్నం చేయండి! దమ్మిడీ ఆదాయం రాని, పైసా ప్రయోజనం లేని వాట్సాప్, ఇతరత్రా సోషల్ మీడియా గ్రూప్‌ల నిర్వహణ, మెసేజ్‌ల పరంపరకు స్వస్తిపలికి మీకు మీరే ఓ సమాచార వ్యవస్థగా మారండి. చదువరులను ఆకట్టుకునేలా కనీసం రోజుకు ఓ పది నుంచి పదిహేను మంచి కంటెంట్ కలిగిన ఐటమ్స్ (టెక్ట్స్/ఇమేజ్‌లు) లేదా వీడియాలను సొంతంగా సమకూర్చుకునే సామర్ధ్యం ఉంటే ఒకరివద్ద తలవంచే పనిలేకుండా నీతిమంతమైన వెబ్ జర్నలిజంలో మనగలిగే అవకాశం మీ కళ్లముందే ఉంది.

డబ్బులిచ్చి కొనుక్కొనే ‘కార్డు’లను కాకుండా కష్టాన్ని నమ్ముకుని మీడియాలో ముందుకెళ్లాలనుకునే వారికి మాత్రమే ఉపయోగపడేలా పత్రికలు, వెబ్‌సైట్/న్యూస్ ఛానల్/ఆన్‌లైన్ పోర్టల్ వంటి కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ‘న్యూ మీడియా’ (http://davp.nic.in/New_media.html) రంగంలో నిలదొక్కుకునేందుకు వీలుగా ఈ రంగంలో కొనసాగండి. జర్నలిజంలో వివిధ రూపాలలో కొనసాగుతున్న వారిలో వృత్తిపరంగా తమ బాధ్యలతను నిర్వర్తిస్తున్న వారు మినహా చాలా మంది వరకు తమ సమయాన్ని సోషల్ మీడియా పోస్టింగులు, గ్రూపుల నిర్వహణ ద్వారా వృధాచేసుకుంటున్నారన్నది వాస్తవం.ఃఃఅదే సమయంలో రోజుకు కనీసం ఓ రెండు గంటలు వెచ్చిస్తే చాలు ‘న్యూస్‌టైమ్’ సహకారంతో జర్నలిజంలో గుర్తింపుతో పాటు సొంత ఆదాయాన్నీ సమకూర్చుకోవచ్చు.

పైన పేర్కొన్న విధంగా పనిచేసిన వెబ్‌సైట్/న్యూస్ ఛానల్/ఆన్‌లైన్ పోర్టల్/ఈ-పేపర్ వంటి వాటికి ఆన్‌లైన్ యాడ్స్ ద్వారా ఆదాయాన్ని ఆర్జించిపెట్టే గూగుల్ యాడ్‌సెన్స్ తరహా ప్రకటన వేదికలు అనేకం. దీని కోసం ఎవరికీ ఎలాంటి చెల్లింపులూ జరపాల్సిన పనే ఉండదు. క్రమం తప్పకుండా (కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు రోజుకు కనీసం ఆరుసార్లు) నిర్ణీత సంఖ్యలో కంటెంట్ (ఐటమ్స్ లేదా వీడియోలు) అప్‌డేట్ చేస్తూ ఉండడమే.

దేశవ్యాప్తంగా రోజుకు కనీసం 750 మంది జర్నలిస్టులు సొంత వెబ్‌సైట్/పోర్టల్ లేదా వెబ్ ఛానల్ పెడుడుతున్నారంటే వెబ్ జర్నలిజం ప్రాధాన్యత ఎంతలా విస్తరిస్తోందో అర్ధంచేసుకోవచ్చు.

ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఒకటి, అరా తప్ప దాదాపు అన్ని పెద్ద పత్రికలు, టీవీ ఛానళ్లూ సొంత వెబ్‌సైట్లను మాత్రమే కాదు, వెబ్ మీడియానూ కలిగి ఉన్నాయి. ఉదాహరణకు sakshipost, eenadu web media వంటివి చెప్పవచ్చు. ‘ఫస్ట్‌పోస్ట్’ తరహాలో ‘సాక్షిపోస్ట్’ ఆంగ్లం సహా హిందీలోనూ విశేష ఆదరణ చూరగొంటోంది. వీటికి ఆన్‌లైన్ యాడ్స్ ఆదాయం కూడా లక్షల్లో ఉంటోందంటే నమ్మశక్యంకాదు.

నాటికీ ప్రాచుర్యం పొందుతూ, ప్రపంచవ్యాప్తంగా పాఠకుల ఆదరాభిమానాలను చూరగొంటున్న వెబ్ జర్నలిజానికి ఇస్తున్న ప్రాధాన్యతను కొనసాగిస్తున్న ‘న్యూస్‌టైమ్’ తాజాగా కంటెంట్ ప్రొవైడర్లను ప్రోత్సహించాలని నిర్ణయించింది.

సొంత పత్రిక లేదా వెబ్‌సైట్/న్యూస్ ఛానల్/ఆన్‌లైన్ పోర్టల్/ఈ-పేపర్ వంటివి ఉన్నవారు ‘కంటెంట్ యూజర్’గాను, లేని వారు ‘కంటెంట్ ప్రొవైడర్’గానూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ తరహాలో వెబ్ జర్నలిజం కోసం కేంద్ర ప్రభుత్వం పరిచయం చేసిన ‘న్యూ మీడియా’ రంగం ద్వారా ఆర్జించవచ్చు.

కేవలం నామమాత్రపు చార్జీతోనే వెబ్‌సైట్/న్యూస్ ఛానల్/ఆన్‌లైన్ పోర్టల్/ఈ-పేపర్/పత్రిక నిర్వహణ సేవలను అందిస్తున్న ‘న్యూస్‌టైమ్’ గత ఏడాది కాలంగా వెబ్ జర్నలిజాన్ని కూడా ఇతోధికంగా ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే.

వెబ్‌సైట్/న్యూస్ ఛానల్/ఆన్‌లైన్ పోర్టల్/ఈ-పేపర్/పత్రిక నిర్వాహకులు తాము సొంతంగా సమకూర్చుకున్న కంటెంట్‌తో పాటు ‘న్యూస్‌టైమ్’ నుంచి కూడా కొంత కంటెంట్‌ను పొందవచ్చు. అదే విధంగా కొత్తగా ఈ రంగంలోకి ప్రవేశించేవారూ తక్కువ చార్జీకే ఈ సేవల్ని వినియోగించుకోవచ్చు.

ఒక నెల చార్జీతో మూడు నెలల సర్వీసును పొందవచ్చు. కొత్తగా పత్రికలు, వెబ్‌సైట్‌లు పెట్టిన వారికి, ఇప్పటికే ఈ రంగంలో ఉన్నవారికీ నిర్వహణ ఖర్చులు పెనుభారంగా మారిన నేపథ్యంలో ప్రచురణకర్తలకు కొంత ఊరట కలిగించేందుకు అన్నట్లు తాజా ఆఫర్ ఉపయుక్తంగా ఉంటుందనడంలో సందేహం లేదు.

ఫాంట్ కన్వర్షన్ సాఫ్ట్‌వేర్లతో నిమిత్తం లేకుండా ప్రింట్/వెబ్ మీడియాకు అవసరమైన కంటెంట్‌ను ‘రెడీ టూ యూజ్’ ఫార్మెట్‌లో ఆఫర్ చేసే సేవల్ని కూడా ఇదే ప్రాతిపదికన అందించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది.

దాదాపు 45 వేల రూపాయల ఖర్చయ్యే పూర్తిస్థాయి వాణిజ్య విలువలతో కూడిన డైనమిక్ ఫార్మెట్‌లోని వెబ్‌సైట్/న్యూస్ ఛానల్/ఆన్‌లైన్ పోర్టల్/ఈ-పేపర్‌ను కేవలం 15,500 రూపాయలకే (డొమైన్ రిజిస్ట్రేషన్, హోస్టింగ్, డిజైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ సహా ఏడాది పాటు ఉచిత టెక్నికల్ మెయింటెనెన్స్) అందించే అత్యద్భుతమైన అవకాశాన్నీ ప్రత్యేక ప్రోత్సాహక ఆఫర్ కింద ‘న్యూస్‌టైమ్’ అందిస్తోంది.

కేవలం కంటెంట్ అప్‌డేట్స్ లేకపోవడవం వల్ల చాలా వెబ్‌సైట్లు, వెబ్ ఛానళ్లు, న్యూస్ పోర్టళ్లు, ఈ-పేపర్ వంటి సైట్లు ఆన్‌లైన్ యాడ్స్ ద్వారా కనీస మొత్తాన్ని కూడా ఆర్జించలేకపోతున్నాయి. ఈ సమస్యను మా న్యూస్ అప్‌డేషన్ ప్యాకేజీ ద్వారా అధిగమించవచ్చు.

దీంతో పాటు, మీ పత్రిక, వెబ్‌సైట్/ఛానల్‌ను సోషల్ మీడియా నెట్‌వర్క్‌ (సామాజిక అనుసంధాన వేదిక)లో విస్తృతంగా ప్రచారం చేసుకునే వెసులుబాటూ ఉంది. ఇప్పటికే ఉన్న మీ పత్రిక, వెబ్‌సైట్/ఛానల్‌కు యూనీకోడ్‌లో కంటెంట్ (వార్తలు, వ్యాసాలు, ఎడిటోరియల్, సినిమా, క్రీడలు, వాణిజ్య, ఇతర వింతలు, విశేషాలు) పరిమితకాలం పాటు ఉచితంగానే పొందవచ్చు.

సొంత కంటెంట్ లేని వెబ్‌సైట్లు/ఛానళ్లకు ఆన్‌లైన్ యాడ్స్ ద్వారా ఆదాయం కూడా పెద్దగా ఉండదని గుర్తించాలి.

మా వద్ద సర్వీసు పొందిన ప్రచురణకర్తలకు సెర్చ్ ఇంజిన్లలో కీలకపాత్ర పోషించే సైట్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (Site Engine Optimisation) పూర్తి ఉచితం.

ఈ-పేపర్, వెబ్‌సైట్/ఛానల్‌ డెవలప్‌మెంట్‌తో పాటు ఆదాయాన్ని సమకూర్చే గూగుల్ యాడ్ అకౌంట్ యాక్టివేషన్ ప్రక్రియలో మావంతు సాయం ఉంటుంది.

ఔత్సాహికులు మా సర్వీస్ గురించి, వాటి వినియోగం గురించీ తెలుసుకునేందుకు మా రాయితీ సేవల్ని వినియోగించుకునేందుకు, నమోదు చేసుకునేందుకూ మా ఆధీకృత వెబ్‌సైట్ agency.newstime.inలో రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. తక్షణమే నమోదుచేసుకునేందుకు మా ప్రతినిధిని 6300795484 లేదా 9390556171 నంబర్లలో సంప్రదించవచ్చు. లేదా newstimedaily@gmail.com మెయిల్‌కు సంప్రదించి కూడా వివరాలను పొందవచ్చు.

ఈ సమాచారం మరింత మందికి ఉపయోగపడుతుందనిపిస్తే మీకు తెలిసిన వారికి దయచేసి ఫార్వర్డ్ చేయగలరు.