సాధారణంగా చాలా మంది మహిళలు తమకు స్తన సౌందర్యం అంతంత మాత్రంగా, లేదా చిన్నవిగా ఉన్నాయని చాలా బాధపడిపోతుంటారు. తోటి స్నేహితులు చేసే కామెంట్స్‌ కారణంగా వారు లోలోపల కుమిలిపోతుంటారు. మరి కొందరు పురుషలక్షణాల వల్ల ఇలా జరుగుతుందని అనుకుంటారు. నిజానికి స్తనాలు సన్నగా, చిన్నగా ఉండటానికి పలు కారణాలున్నాయంటారు వైద్యనిపుణులు. వంశపారంపర్యంగా తల్లి లేదా తండ్రి వైపు వారు సన్నగా ఉండటం ఒక కారణంగా పేర్కొంటారు.

పౌష్టికాహార లోపం వల్ల, పోషణ సరిగా లేకపోవడం వల్ల శరీరానికి కావల్సిన విటమిన్లు, ప్రోటీన్లు, ఇతర ఖనిజాలు తగు మోతాదులో అందకపోవడం వల్ల, హార్మోన్ల సమతుల్యం లోపించడం వల్ల, మానసిక ఒత్తిడి వల్ల కూడా స్తనాలు చిన్నగా సన్నగా ఉంటాయని వైద్యులు చెబుతుంటారు. మహిళకు స్తనాల ప్రాధాన్యత ఎంతో వుంది. బిడ్డకు జన్మనిచ్చిందంటే, పుట్టిన ఆ బిడ్డకు పాలు ఆమె వాటినుండే అందించాలి. అంతేకాదు మహిళకు అందం ఆమెకుగల స్తనాలే. మహిళ అనటానికి చిహ్నంగా అవి ఆమెను చూడగానే మొదటి చూపులోనే కనపడతాయి. మహిళలు ఈ అందాలను అనేక విధాల సంరక్షించుకుంటారు.

తమ స్తనాల సైజు అధికంగా వుండటానికి ఎంతో శ్రమ పడతారు. వ్యాయామాలు చేస్తారు. మందులు వాడతారు. మంచి ఆహారం తీసుకుంటారు. మరి కొంతమంది సినీ నటులు లేదా సెలబ్రిటీలు తమ స్తనాలను సర్జరీల ద్వారా కూడా పెద్దవిగా చేసుకొని మంచి శారీరక రూపాన్ని పొందుతారు. మహిళకు స్తనాలు చిన్నవిగా వుంటే నలుగురిలో నగుబాటే. స్తనాల సైజులు పెంచటానికిగాను చాలామంది ఈ విధంగా ఎంతో శ్రమపడతారు. కాని సహజ ఆహారాల ద్వారా కూడా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. హార్మోన్ల అసమతుల్యత స్తనాలు చిన్నవవటానికి కారణం.

మహిళ శరీరంలో టెస్టోస్టిరోన్‌ ఉత్పత్తి అధికమైతే అది స్తనాల పెరుగుదల అరికడుతుంది. చికెన్‌: మాంసాహార ఉత్పత్తులలో ప్రధానము, సాధారణంగా బయట తేలికగా లభ్యం అయ్యే చికెన్‌ లో ఈస్ట్రోజన్‌ అధికం. చికెన్‌ రెగ్యులర్‌ గా తింటే స్తనాలు సహజంగా పెరుగుతాయి. తాజా పండ్లు: శరీరంలో టెస్టోస్టిరోన్‌ తగ్గించాలంటే, తాజా పండ్లు, ఈస్ట్రోజన్‌ అధికంగా వుండే కూరగాయలు, కాయ ధాన్యాలు, బార్లీ, బ్రౌన్‌ రైస్‌, ఓట్స్‌ వంటివి తింటే వక్షోజాలు సైజు పెరిగే అవకాశం వుంది.

డైరీప్రొడక్ట్స్‌: పెరుగు వంటి పాల ఉత్పత్తులు కూడా స్తనాల సైజులు సహజంగా పెంచుతాయి.

కిడ్నీ బీన్స్‌: ఈస్ట్రోజన్‌ అధికంగా వుండే ఛిక్‌ పీస్‌, కిడ్నీ బీన్స్‌, రెడ్‌ బీన్స్‌, బఠాణీ, మొదలైన కాయ ధాన్యాలు తింటే స్తనాలు పెరిగేలా చేస్తాయి. సాధారణంగా చాలా మంది బీన్స్‌ అంటే బాగా తెలుసు. అయితే కిడ్నీ బీన్స్‌ అంటే కొంత మంది తెలియదు.

గుడ్లు: గుడ్లు, చేప, మాంసం, పాలు కూడా స్తనాల పెరుగుదలకు సహకరిస్తాయి. మహిళ తాను యుక్త వయసు పొందినప్పటినుండి పాల ఉత్పత్తుల ఆహారాలు అధికంగా తీసుకోవాలి. ఇవి ఆమెలో యుక్తవయసు నుండి వచ్చే శారీరక ఎదుగుదలను పెంచటానికి పనిచేస్తాయి.

గ్రీన్‌ వెజిటేబుల్స్‌: పచ్చని ఆకు కూరలు, ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా వుండే ఆహారాలు స్తనాల కణాలను వృధ్ధి చేస్తాయి. బీట్‌ రూట్‌, కేబేజి, కాలీఫ్వర్‌, కేరట్లు, ఉల్లి, కుకుంబర్‌, గుమ్మడి మొదలైనవి తినాలి. గ్రీన్‌ లీఫీ వెజిటేబుల్స్‌లో విటమిన్స్‌, ప్రోటీనులు, మినిరల్స్‌, ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. శరీర జీవక్రియలు క్రమంగా పనిచేయడానికి ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవాలి.

స్ట్రాబెర్రీస్‌: చెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు లో ఈస్ట్రోజన్‌ అధికంగా వుంటుంది. వీటిని మీ ఆహారంలో చేర్చండి. కాఫీలు, కూల్‌ డ్రింక్‌ లు, ఉప్పు అధికంగా వుండే బేకరీ తిండ్లు అరికట్టాలి. ప్రతిరోజు అధికంగా నీరు త్రాగండి. నువ్వులు కూడా స్తనాల పెరుగుదలకు తోడ్పడతాయి. ప్రతిరోజూ స్తనాలకవసరమైన వ్యాయామం చేయాలి. ఈ ఆహారాలు, వ్యాయామాలతో మీ స్తనాలకు చక్కటి ఆకర్షణీయమైన షేపులనిచ్చి మహిళలుగా గర్వపడండి.

లికోరైస్‌: లికోరైస్‌: లికోరైస్‌ లో కూడా స్తన సంపదను పెంచే ఈస్ట్రోజన్‌ ను శరీరంలో విడుదల చేయడానికి ఉపయోగపడే అనేథోల్‌, డైఅనేథల్‌, ఫోటో అనేథల్‌ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఈ కాంపౌండ్స్‌ ఈస్ట్రోజెన్‌, ప్రోలాక్టిన్‌ హార్మోన్లు పెంచుతాయి.

స్టార్‌ ఆనీస్‌(నక్షత్రపు సోంపు): ఇది చైనీస్‌ మూలిక. దీన్ని వంటకాలకు, మసాల దినుసులతో పాటు విరివిగా ఉపయోగిస్తుంటారు. అయితే స్తన పరిమాణాన్ని సహజంగా పెంచుకోవడానికి వినియోగించవచ్చు. సోంపు మరియు స్టార్‌ సోంపు ఈ రెండింటిలో ఈస్ట్రోజెన్‌ ప్రభావితం చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

ఫెన్నల్‌/(సోంపు): స్తన సంపదను పెంచే ఈస్ట్రోజన్‌ ను శరీరంలో విడుదల చేయడానికి ఉపయోగపడే అనేథోల్‌, డైఅనేథల్‌, ఫోటో అనేథల్‌ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అంతే కాదు ఈస్ట్రోజన్‌ వంటిదే మరో ఫోటోఅనేథోలో ఇందులో ఉండి బ్రెస్ట్‌ సైజ్‌ పెరుగుదలకు సహాయపడుతుంది. పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది. మెంతులు: ఆయుర్వేద ప్రకారం మెంతులు బ్రెస్ట్‌ సైజును పెంచడంలో చాలా సహాయపడుతుంది. అందుకు మెంతులను రాత్రంతా నీళ్ళలో నానబెట్టి ఆ నీటితో స్తనాల వద్ద మసాజ్‌ చేయాలి. ఇంకా ఆ నానిన మెంతులను మెత్తని పేస్ట్‌ చేసి ఆ పేస్ట్‌ను కూడా మసాజ్‌గా ఉపయోగించాలి.

క్యారెట్‌: క్యారెట్‌లోని కెరోటినాయిడ్స్‌ స్తన సౌందర్యం పెంచడానికి అద్భుతంగా పనిచేస్తాయి. జ్యూస్‌కు బదులు క్యారెట్స్‌ అలాగే తినడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.

ఉల్లిపాయ: ఉల్లిపాయల వల్ల ఒదొక మంచి ప్రయోజనం. ఉల్లిపాయలో అధిక శాతంలో సల్ఫర్‌ ఉంటుంది. సల్ఫర్‌ రక్త ప్రసరణను పెంచి స్తన వ్రుద్దిని పెంచుతుంది కీరదోస: కీరదోసలో ఖనిజలవణాలు ఎక్కువ. సలాడ్‌ గానే కాదు సూప్‌గానూ తీసుకోవచ్చు. కీరదోసలో విటమిన్‌ సి, పీచు, పొటాషియం, మెగ్నిషియం సమృద్ధిగా లభిస్తాయి. అవి శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా వుండే ఆహారాలు స్తనాల కణాలను వృధ్ధి చేస్తాయి.

లెగ్యూమ్‌: చిక్కుళ్ళు(లెగ్యూమ్‌): లెగ్యూమ్స్‌ లో ప్రోటీన్‌ కంటెంట్‌ అధికంగా ఉంటుంది. లెగ్యుమ్స్‌ పళ్ళును స్ట్రాంగ్‌గా ఉంచుతాయి. మీరు తీసుకొనే ఆహారాల్లో చిక్కుళ్ళకు, బీన్స్‌కు అధిక ప్రాధాన్నత ఇవ్వండి. ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా వుండే ఆహారాలు స్తనాల కణాలను వృధ్ధి చేస్తాయి.

బాదం: బ్రొమైన్‌, మ్యాంగనీస్‌ అధికంగా ఉన్న ఆహారాలు నట్స్‌ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి కావల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. ఇంకా ఇందులో ఉండే ఫైబర్‌, ప్రోటీనులు హార్మోనులను బ్యాలెన్స్‌ చేసి రెగ్యులర్‌ పీరియడ్స్‌ అవ్వడానికి సహాయచేస్తుంది.

ఫ్రాన్స్‌: బ్రొమైన్‌, మ్యాంగనీస్‌ అధికంగా ఉన్న ఆహారం ప్రాన్స్‌. సీ ఫుడ్స్‌ అంటే ప్రాన్స్‌, రొయ్యలు, పీతలు, వంటివాటిలో క్యాల్షియం, ప్రాస్పరస్‌ అధిక శాతంలో ఉండటం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. స్తనాల కణాలను వృధ్ధి చేస్తాయి.

వెల్లుల్లి: బ్రొమైన్‌, మ్యాంగనీస్‌ అధికంగా ఉన్న ఆహారాలు వెల్లుల్లి. సెలీనియం పుష్కలంగా ఉండే మరో ఘాటైన ఆహారం వెల్లుల్లి. ఇది థైరాయిడ్‌కు ఆరోగ్యకరమైనది మాత్రమే కాదు, మధుమేహగ్రస్తులకు హార్ట్‌ పేషంట్స్‌కు కూడా ఆరోగ్యకరమే.

వ్యాయామం: సహజమైన వ్యాయామం ద్వారా రొమ్ము సైజులను పెంచుకోవచ్చు. ఖచ్చితమైన ‘పుష్‌ అప్‌’ వ్యాయామం ద్వారా వీటి పెరుగుదల అతి తక్కువ కాలంలోనే సాద్యమవుతుంది.