న్యూఢిల్లీ, అక్టోబర్ 22 (న్యూస్‌టైమ్): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీని కలుసుకుని వివిధ విషయాలపై ఆరోగ్యకరమైన, విస్తృతమైన పరస్పర చచర్చ నిర్వహించారు.

మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ప్రొఫెసర్ బెనర్జీ, ప్రపంచ పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రయోగాత్మక విధానం కోసం భార్య ఎస్తేర్ డుఫ్లో, మైఖేల్ క్రెమెర్‌లతో కలిసి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ గెలుచుకున్నారు.

‘‘నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీతో అద్భుతమైన సమావేశం. మానవ సాధికారత పట్ల ఆయనకున్న అభిరుచి స్పష్టంగా కనిపిస్తుంది. వివిధ విషయాలపై మా మధ్య ఆరోగ్యకరమైన, విస్తృతమైన పరస్పర చర్చ జరిగింది. ఆయన సాధించిన విజయాల గురించి భారతదేశం గర్విస్తుంది. ఆయన భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు’’ అని మోడీ అన్నారు.

ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా నరేంద్ర మోదీ ఆ భేటీకి సంబంధించిన ఫొటోను షేర్ చేశారు.