* వయసు మళ్ళిన వారివి వెనుకటి కాలపు గాధలు, వయసులో ఉన్న వారివి ముందున్న స్వప్నాలు.
* కలల స్ధానంలోకి శోకం, క్షోభ వచ్చేవరకు మనిషి వృద్ధుడు కాడు.
* సంతోషం మనిషి తీరు అవుతుందేకాని మనిషి దగ్గరున్న వస్తువు ఏమాత్రం కాదు.
* నాకు నచ్చని వాటిని మరచిపోవడం, నాకు నచ్చిన వాటిని ఆచరించడం నా అలవాటు.
* నాకు గతాలు లేవు. కాలం వాటిని కబలించింది. రేపు అన్నది లేకపోవచ్చు. కానీ ఈ రోజు మాత్రం నా దగ్గరుంది.
* ఉజ్వల భవిష్యత్తు పై అచంచల విశ్వాసమే ఆస్తికత్వం. ఆత్మ విశ్వాసమే విజయానికి ప్రధమ సూత్రం, అది లోపించిన వ్యక్తిలో శ్రద్ద స్థిరపడదు.
* ఎప్పుడూ ప్రయత్నించని వ్యక్తి కంటే ప్రయత్నించి విఫలమైన వ్యక్తే మేలు.
* ఏదైనా ఒక పనిని చేసే ముందు దాని పర్యవసానం ఏమిటో ఒక్క క్షణం ఆగి ప్రశ్నించుకొని అప్పుడు ఆ పనిని ప్రారంభించడం అత్యుత్తమం.
* ఒక వ్యక్తి యొక్క జయాపజయాలు అతను సమయాన్ని ఎలా ఖర్చు చేస్తాడన్న విషయం పైనే ఆధారపడి ఉంటాయి.
* ఇతరులను అర్థం చేసుకున్న వాడు జ్ఞాని, తనను తాను అర్ధం చేసుకున్న వాడు వివేకి.
* చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కోండి. డబ్బును తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.
* అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడూ చేస్తూనే ఉంటారు.
* అప్రయత్నంగా సాధించే గెలుపుకంటే, మన ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.
* అన్ని ఆశలు అడియాసలైనప్పుడు మన ముందు భవిష్యత్తు అలానే స్థాణువుగా ఉంటుంది.
* గురి వల్ల గొప్ప విలుకాడు అవుతాడే కాని పొదలో ఉన్న బాణాల వల్ల కాదు.
* అన్నీ భగవంతుడిపైనే ఆధారపడ్డాయన్నట్లు ప్రార్ధించు. అన్నీ నీపైనే ఆధారపడ్డాయన్నట్లు శ్రమించు.
* అదృష్టం సంసిద్దంగా ఉన్న మనస్సునే వరిస్తుంది. అన్ని సుగుణాలకు పట్టుదలే పట్టుకొమ్మ.
* కష్టపడి పనిచేసేవారికి అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి. కష్టాలను జయించడానికి నిస్పృహకంటే చిరునవ్వు చాలా బలవంతమైనది. కష్టాలను తప్పించుకోవడం కాదు, వాటిని అధిగమించడమే నిజంగా గొప్పదనం.
* జీవితం అనేక సంఘటనల గొలుసు. జీవించడం అనేక అనుభవాల గొలుసు. జీవితం ఎడతెరిపి లేకుండా ప్రవహించే అనుభవాల సారం.
* అర్హతను సంపాదించండి. ఆ తరువాత కోరికను పెంచుకోండి. అపజయం అంచులవరకు పోకుండా లభించే విజయంలో పులకింత ఉండదు.
* జీవితానికి అత్యున్నత లక్ష్యం ఏర్పరుచుకోవడం కష్టం. ఏర్పరుచుకుంటే దాన్ని సాధించడం సులభం.
* గొప్పవారి గొప్పతనం, వారు చిన్నవారితో ప్రవర్తించే తీరును బట్టి తెలుస్తుంది. గొప్పపనలు చేయడానికి కావలసింది ముఖ్యంగా శక్తికాదు – ఓపిక.
* గౌరవాలు పొందడం కాదు గొప్ప – వాటికి తగిన అర్హత సాధించడం గొప్ప.
* గమ్యం చేరుకోవటం కంటే, నమ్మకంతో ప్రయాణం చేయటమే మేలైనది.
* నీ అంగీకారం అనేది లేకుండా నీ ఆత్మగౌరవాన్ని ఎవ్వరూ తగ్గించలేరు.
* చిరునవ్వుతో కూడినవైఖరి ప్రతికూల పరిస్ధితులను కూడా అవకాశాలుగా మార్చగలదు.
* నిమిషాలను జాగ్రత్తగా వాడుకోండి. గంటలు తమ జాగ్రత్తని తాము చూసుకోగలవు.
* నిన్నటి గురించి మదనపడకుండా రేపటి గురించి భయపడకుండా ఆలోచించగలిగిన మనిషికి విజయసోపానాలు అందినట్లే.
* చదివిన దానిని, విన్న దానిని ఆచరించడం సాధన.
* ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.
* తనకు నచ్చిన పనిని ప్రతివాడు చేస్తాడు. కానీ చేస్తున్న పనిని ఇష్టపడేవాడికే నిజమైన సంతోషం లభిస్తుంది.
* తెలుసు కోవటం కంటే తెలుసుకున్న దానిని జీర్ణించుకోవటం ముఖ్యం.
* దీపపు వెలుగు నూనెపై ఆధారపడి ఉంటుంది.
* సాహసవంతుడి వరకూ అదృష్ట దురదృష్టాలు కుడి ఎడమల లాంటివి. అతడు రెండింటినీ వాడుకుంటాడు.
* సుదీర్ఘమైన అనుభవంపై ఆధారపడి వున్న చిన్న వాక్యమే సామెత.
* మన వద్ద ఉన్న వస్తువును పోగొట్ట్టుకోనంతవరకు ఆ వస్తువు విలువను మనం తెలుసుకోలేము.
* నిప్పు, నీరు – ఈ రెండు మంచి సేవకులు. కానీ చాలా చెడ్డ యజమానులు.
* గొప్పపనలు చేయడానికి కావలసింది ముఖ్యంగా శక్తికాదు – ఓపిక.
* శ్రమవల్ల లభించేది గొప్ప బహుమానం కానే కాదు. శ్రమవల్ల వచ్చే మార్పే గొప్ప బహుమానం.