ముంబయి, అక్టోబర్ 29 (న్యూస్‌టైమ్): ధాన్యపు గింజల్లో రాగులు ముఖ్యమైనవి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రాగి సంగటి ఆరగించడం లేదా అంబలి తాగడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా రాగితో తయారు చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలను ఆరగించడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రాగులతో తయారు చేసే అంబలి వల్ల కలిగే మేలు పరిశీలిద్ధాం. రాగులతో చేసిన పదార్థాలు తింటే బరువు తగ్గుతారు. రాగి అంబలి శరీరానికి మంచి బలం ఇస్తుంది. రోజంతా శరీరానికి కావల్సిన శక్తి, పోషకాలు అందుతాయి. రాగి అంబలికి చలువ చేసే గుణం ఉంది.

శరీరంలో ఉండే అధిక వేడిని తగ్గించుకోవచ్చు. ఒక గ్లాస్ రాగి అంబలి తాగినా చాలా సేపు ఆకలి వేయదు. కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆహారం ఎక్కువగా తినాలనిపించదు. ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు చేస్తుంది. స్థూలకాయం ఉన్న వారు రాగి అంబలి తాగితే వేగంగా బరువు తగ్గవచ్చు. అల్పాహారానికి బదులు రాగి అంబలి తాగితే రోజంతా యాక్టివ్‌గా ఉండవచ్చు. శారీరక దృఢత్వం చేకూరుతుంది. బీపీ, షుగర్ నియంత్రణలోకి వస్తాయి. రక్తస్రావం జరుగుతున్న వారికి రాగి అంబలి తాగిస్తే స్రావం ఆగిపోతుంది. రాగి అంబలిని నిత్యం తాగుతుంటే పురుషుల్లో వీర్యం వృద్ధి చెందుతుంది. ఎదిగే పిల్లలకు దీనిని ఇవ్వడం వల్ల శక్తివంతంగా తయారవుతారు.

చదువుల్లో ప్రతిభ కనబరుస్తారు. మెదడు చురుగ్గా ఉంటుంది. మరోవైపు, బెర్రీస్‌ పురుషుల ఆరోగ్యానికి మేలు చేయడమే గాక నేచురల్ వయాగ్రాల పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, చెర్రీస్, బ్లాక్ బెర్రీస్, బిల్బెర్రీస్, రాస్బెర్రీస్ పురుషుల్లో అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు గొప్ప మెడిసిన్‌లా పనిచేస్తాయట. ముఖ్యంగా లైంగిక సమస్యలను నివారించడంలో సహాయపడుతాయట.

వివిధ రంగులున్న బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినిరల్స్, ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయని, ఇవి పురుషుల్లో శీఘ్రస్కలనం, ఇతర లైంగిక సమస్యలను నివారించడమే కాకుండా వయాగ్రా కంటే ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయని చెబుతున్నారు.

బెర్రీస్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. బెర్రీస్‌లో ఉండే పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి. కాబట్టి పురుషులు వీటిని ఎక్కువగా తీసుకోవాలి. మెగ్నీషియం కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్‌కు సహాయపడుతుంది.