శ్రీకాకుళం, నవంబర్ 7 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాధిపతి తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమదాలవలస నియోజకవర్గం పరిధిలోని సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురంలో గ్రామ సచివాలయం భవనానికి గురువారం సాయంత్రం తమ్మినేని శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రసంగించారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి, మాజీ ఎంపీపీ కె.వి. సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ ప్రతినిధి సురవరం నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు, పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.