కాంచీపురం, నవంబర్ 7 (న్యూస్‌టైమ్): తెలంగాణా అసెంబ్లీ ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ గురువారం కాంచీపురంలోని కామాక్షి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు పద్మారావు గౌడ్‌కు సాంప్రదాయ బద్దంగా స్వాగతం పలికారు.

తెలంగాణా రాష్ట్రం అభివృధి పథంలో సాగాలని, తాను ప్రాతినిద్యం వహిస్తున్న సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్ధించినట్లు పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొనారు.